గ్రామాల్లో విద్యుత్ పొలం బాట కార్యక్రమాలు
NEWS Nov 12,2024 02:01 pm
కథలాపూర్ మండలం భూషణరావుపేట, కథలాపూర్ గ్రామాల్లో ట్రాన్స్ కో అధికారుల ఆధ్వర్యంలో విద్యుత్ పొలం బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని కోరారు. కెపాసిటర్లు బిగించుకోకపోతే నాణ్యమైన విద్యుత్తు సరఫరా కాదని చెప్పారు. ఓవర్లోడ్ సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివాకర్ రావు, సబ్ ఇంజనీర్ నవీన్, సిబ్బంది వంశీ, మధు పాల్గొన్నారు.