మైదుకూరు: అభాగ్యులకు అన్నదానం
NEWS Nov 12,2024 06:21 pm
మైదుకూరు పట్టణానికి చెందిన నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైదుకూరులోని వివిధ ప్రాంతాల్లో నివసించే అభాగ్యులకు, వృద్ధులకు, సాధువులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సేవా సంస్థ కోశాధికారి కొండారెడ్డి మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్నారు. ప్రతి ఒక్కరు సహాయం చేయాలన్నారు.