కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మంగళవారం తన తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు - సరోజ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రకు బయలుదేరారు. రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు కోరుట్ల నుంచి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ఉన్నారు.