రైతుల సమస్యల పరిష్కారానికై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం కొనసాగుతోంది. పాదయాత్రను కోరుట్ల పట్టణంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల వరకు పాదయాత్ర కొనసాగనున్నది. మధ్యలో చల్ గల్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రలో పాల్గొననున్నారు. భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు