మౌలానా అబుల్ కలాం జయంతి వేడుక
NEWS Nov 12,2024 06:14 am
మెట్ పల్లి పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలు, జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్తులకు అతిధుల చేతుల మీదుగా మెమోంటోలను అందజేశారు. చిన్నతనం నుంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల ఉన్నత స్థాయికి చేరవచ్చునని, నిరూపించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపల్ తిరుపతి కోరారు.