సంగం శ్రీనివాస్ ఆర్ధిక సహాయం
NEWS Nov 11,2024 06:29 pm
దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలోని రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ నేపధ్యంలో బాధిత కుటుంబాలకి ఒక్కొక కుటుంబానికి 3 వేల రూపాయల చొప్పున రూ.6000, టిఎస్ యుటిఎఫ్ దుమ్ముగూడెం ప్రధాన కార్యదర్శి సంగం శ్రీనివాస్ ఆర్ధిక అందించారు. అయన దాత్రుత్వానికి యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్, దుమ్ముగూడెం మండల భాద్యులు ఎం.సురేష్ బాబు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.