300 మంది పేదలకు అన్నదానం
NEWS Nov 11,2024 03:03 pm
కొండపల్లి పట్టణానికి చెందిన యువకులు ప్రధాన కూడళ్లలో 300 మంది పేదలకు సోమవారం అన్నదానం చేశారు. తమ సంపాదనలో కొంత కేటాయించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పేదలకు సహాయం చేయాలని కోరారు. ప్రత్యేక వాహనం ద్వారా పేదలకు ఆహారం, తాగునీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం.డి. అష్రఫ్ అలీ, ఎస్.కె.అహ్మద్, రవి, కరణం సుధీర్, ఎస్.కె.ఇబ్రహీం షరీఫ్, ఎస్.డి. ఖాజా తదితరులు పాల్గొన్నారు.