గ్రేస్ మినిస్ట్రీస్: వరద బాధితులకు సాయం
NEWS Nov 10,2024 06:44 pm
గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురి అయిన కేతనకొండ, చిలుకూరు,కాచవరం, గ్రామస్తులకు 300 కుటుంబాలకు బియ్యం, నూనె, పంచదార, గోధుమ రవ్వ , గోధుమ పిండి, సబ్బులు, చీరలు, షర్టులు పంపిణీ చేయడం జరిగింది. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన వరదల కారణంగా అనేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని వరద వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయారని, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వరద బాధితులకు సహాయం చేయటం అభినందనీయమనీ తెలిపారు.