ముగిసిన కొమిరెడ్డి జ్యోతి అంత్యక్రియలు
NEWS Nov 10,2024 01:05 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి అంత్యక్రియలు ముగిశాయి. మెట్ పల్లిలోని వారి ఇంటి నుంచి అంతిమయాత్ర కొత్త బస్టాండ్ మీదుగా వెంకట్రావుపేట వరకు కొనసాగింది. వెంకట్రావుపేటలోని వారి తోటలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి తదితరులు ఆమెకు నివాళులర్పించారు. భారీగా జనం పాల్గొన్నారు.