మాజీ ఎమ్మెల్యేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
NEWS Nov 10,2024 04:53 am
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదివారం ఉదయం నివాళులర్పించారు. ఆమె పార్థివదేహంపై పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె కుమారులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. కాగా, నేడు జ్యోతి దేవి అంత్యక్రియలు జరగనున్నాయి.