కాంగ్రెస్ నాయకున్ని పరామర్శించిన MLA
NEWS Nov 10,2024 06:18 am
మల్యాల మండలం గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొజ్జ మొండయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది డాక్టర్ల సూచన మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న చొప్పదండి MLA మేడిపల్లి సత్యం శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆదిరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సతీష్, వంశీధర్, వినయ్, అనిల్, తిరుపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.