అంజన్నను దర్శించుకున్న వీరేందర్
NEWS Nov 09,2024 04:31 pm
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ళ వీరేందర్ గౌడ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మండల బిజెపి నాయకులు నేరెళ్ల శ్రావణ్, బండారి రాజు, సంకుర్తి వేణు తదితరులు పాల్గొన్నారు.