డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడిన
వ్యక్తికి ట్రాఫిక్ డ్యూటీ
NEWS Nov 09,2024 10:48 am
పెద్దపల్లి: వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన కమాన్ పూర్ కు చెందిన ఇందారపు రమేష్ కు 500 రూపాయల జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా రెండు రోజులపాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు.