మెట్‌పల్లి డీఎస్పీగా అడ్లూరి రాములు
NEWS Nov 09,2024 06:53 am
మెట్‌పల్లి నూతన డీఎస్పీగా అడ్లూరి రాములు నియమితులయ్యారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న ఉమామహేశ్వరరావును హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న రాములును మెట్‌పల్లి డీఎస్పీగా నియమించారు.