గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
NEWS Nov 09,2024 06:46 am
మల్లాపూర్ మండలం వి.విరావుపేట గోదావరి నదిలో నిన్న శుక్రవారం గల్లంతైన యువకుడు మృతదేహం శనివారం తెల్లవారుజామున లభ్యం అయింది. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన పాకాల శ్రీ వర్ధన్ గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఈత రాక గల్లంతైన విషయం తెలిసిందే,నిన్న ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్న దొరకని మృతదేహం నేడు తెల్లవారుజామున గోదావరి ఒడ్డుకు చేరింది.మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి