జైలు పరిసరాల్లో శుభ్రత పాటించాలి
NEWS Nov 08,2024 06:45 pm
జగిత్యాల: డ్రై డే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో శుక్రవారం జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆడువాల జ్యోతి శానిటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. జైలు పరిసరాల్లో పారిశుద్ధ్యం బాగుండేలా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వల్ల ప్రాణాంతక డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.