మంచి నీటి కొరత లేకుండా చూడాలి
NEWS Nov 08,2024 06:43 pm
కోరుట్ల పట్టణంలోని 3 వార్డులో గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ నీళ్లు అత్యవసరమైన ఇళ్లలో మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు అత్యవసరంగా నిర్వహించి మంచి నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు.