మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు. ఈ వేడుకలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.