RBI క్విజ్ పోటీలకు విద్యార్థులు ఎంపిక
NEWS Nov 08,2024 03:48 pm
కోరుట్లలోని రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఆర్బీఐ క్విజ్ పోటీలకు ఎంపికయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆర్బీఐ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో కళాశాల విద్యార్థులు జగిత్యాల జిల్లాలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపక బృందం అభినందించారు.