ఆలయాన్ని ఎండోమెంట్ చేయాలని వినతి
NEWS Nov 08,2024 11:43 am
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని తొలి వార్డులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్‌లో నమోదు చేయించాలని కోరుతూ.. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కు శుక్రవారం గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్ల జగన్, డాకూరి వెంకటేశ్, బొమ్మెన రఘు తదితరులు పాల్గొన్నారు.