పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
NEWS Nov 08,2024 11:46 am
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ మోహన్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి పట్టణంలోని నేషనల్ హైవే రోడ్డులో డివైడర్‌పై నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా ఆయన నీరు పట్టారు. కుప్సింగ్ కుంట పార్కులో గడ్డి కటింగ్ చేస్తుండగా పరిశీలించారు. 22వ వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, విష్ణు తదితరులు ఉన్నారు.