జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
NEWS Nov 08,2024 07:51 am
కోరుట్ల మండలం మోహన్ రావు పేటకు చెందిన రజిత(38) గత 3 ఏళ్ల నుంచి మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగాలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. నిన్న ఇంటిలో నుంచి వెళ్లిపోయిన ఆమె కోసం కుటుంబీకులు వెతుకుతుండగా. నేడు వారి వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైందన్నారు. మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.