రేగుంటలో వరి ధాన్యం కొనుగోలు
కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Nov 07,2024 12:05 pm
మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో PACS వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు జరపాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.