బాధితుడికి సెల్ ఫోన్ అందజేసిన పోలీసులు
NEWS Nov 07,2024 08:28 am
కోరుట్ల రహీంపుర కు చెందిన అబ్దుల్ జావిద్ అను అతను గత నెల క్రితం జిఎస్ గార్డెన్ నుండి రహీం పురలోని తన ఇంటికి వెళ్తుండగా ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి బుధవారం బాధితుడికి ఎస్సై ఎస్ శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.