ఉచిత పశువైద్య శిబిరం
NEWS Nov 07,2024 04:17 am
రైతులు తమ పశువుల వ్యాధి నివారణకు టీకాలు వేయించి ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్య అధికారి డాక్టర్ మనీషా పటేల్ సూచించారు. మెట్ పల్లి మండల వేంపేట గ్రామంలో జాతీయ సేవ పథకంలో భాగంగా పశువైద్య, సంవర్థక శాఖ, పశువైద్య కళాశాల, పొలాస వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరంలో భాగంగా పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.సురేష్, డా. ప్రియాంక వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు.