కోరుట్ల పట్టణం పాత బస్టాండ్ నంది చౌరస్తా వద్ద గురువారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల టాక్టర్ ను బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అవ్వడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా వున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.