కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రూ .46,05,336 విలువ గల 46 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మితో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అందించే సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటైన తులం బంగారం కూడా అందించాలని అన్నారు.