కడప నగరంలోని స్థానిక 32వ డివిజన్ మంగళ రామభద్రప్ప వీధిలో బుధవారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పురాతన మారమ్మ దేవాలయం పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి భూమి పూజ చేశారు. ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.