మెట్ పల్లిలో మహిళా పుస్తెలతాడు చోరీ
NEWS Nov 06,2024 10:53 am
మెట్ పల్లి పట్టణంలో చైన్స్ స్నాచర్స్ రెచ్చి పోయారు. 12వ వార్డులో నివసిస్తున్న కందనవేణి వాణి అనే మహిళ ఆరుబయట తన కూతురికి అన్నం తినిపిస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనం పై వచ్చి మహిళపై దాడి చేసేసరికి, ఆమె అరవడంతో, ఆమెను కిందకు తోసి, మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడు, అరతులం నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సిఐ నిరంజన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు.