అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
NEWS Nov 06,2024 06:21 am
మెట్‌పల్లి మండలంలోని వేంపేట గ్రామ శివారులో, TS 07 UF 6840 నంబర్ గల ఆటోలో, అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. మెట్‌పల్లి మండలం నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు, ఆటో సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా ప్రభుత్వానికి చెందిన పిడిఎస్ రైసును తరలించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.