మేడిపల్లి మండలంలో గంజాయి సరఫరా చేసినా, విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈజీ మనీకి అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించే నిందితులు ఎవరైనా సరే చట్టప్రకారం శిక్షార్హులన్నారు.