మెట్‌పల్లిలో వాహనాల తనిఖీలు
NEWS Nov 05,2024 01:15 pm
మెట్‌పల్లి పట్టణంలో డీఎస్పీ ఉమా మహేశ్వర రావు ఆధ్వర్యంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, నాటుసారా, మద్యం వంటి అక్రమ రవాణా అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రోడ్డు మార్గాలు, ముఖ్యమైన కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.