మెట్‌పల్లిలో ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ
NEWS Nov 05,2024 01:08 pm
మెట్‌పల్లి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం జిల్లా వైద్యాధికారి ఎండి సమియోద్దీన్ తనిఖీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య శాఖ నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఆస్పత్రులు ఏ డాక్టర్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయో అదే డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారా? అనే విషయాలపై రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఫీజుల వివరాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు.