కోహ్లీ జన్మదినం సందర్భంగా టోర్నమెంట్
NEWS Nov 05,2024 12:33 pm
మల్లాపూర్: విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. వారం రోజులుగా సాగుతున్న టోర్నీలో వీవీ రావుపేట్, రేగుంట జట్లు ఫైనల్‌కి చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో రేగుంట జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన రేగుంట జట్టుకు, రన్నర్‌గా నిలిచిన వీవీ రావుపేట్ జట్లకు BJYM జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్ విన్నర్ కప్, రన్నర్ కప్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు శ్రీకాంత్, వినోద్, బర్గవ్, నాయకులు పాల్గొన్నారు.