రేపటి నుంచి సమగ్ర ఇంటింటి సర్వే
NEWS Nov 05,2024 11:59 am
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 56 ప్రధాన, 19 అనుబంధం కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఎలాంటి ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.