మహిళల హత్యలపై రాచమల్లు హాట్ కామెంట్స్
NEWS Nov 05,2024 11:56 am
ప్రొద్దుటూరు: "ఇద్దరు ఆడబిడ్డలక తండ్రిగా మాట్లాడుతున్నా, రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రంగా ఇంటికి వస్తారనే గ్యారెంటీ లేదు" అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి పాలనలో దాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అన్నారు.