మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
NEWS Nov 05,2024 05:04 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో మదీనా హోటల్లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి నిన్న రాత్రి మద్యం మత్తులో హోటల్ ముందున్న డ్రైనేజీలో పడి మృతి చెందాడు. గత కొంతకాలంగా పట్టణ కేంద్రంలోని మదీనా హోటల్లో పనిచేస్తున్న సాగర్ మద్యానికి బానిసై తాగి తూలుతూ పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.