సైబర్ మోసాలపై కళాబృందం అవగాహన
NEWS Nov 05,2024 03:57 am
మెట్‌పల్లి పట్టణంలోని అర్బన్ కాలనీలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందంతో సైబర్ మోసాలు, గంజాయి, డ్రగ్స్ తదితర వాటిపై పాటల రూపంలో సోమవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, పోలీస్ కళాబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.