సీఎస్ఆర్ కింద రూ. 4 కోట్లు అందించిన డా. ఎన్‌టీటీపీఎస్
NEWS Nov 04,2024 06:54 pm
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్‌టీటీపీఎస్) రూ.4 కోట్ల చెక్కును సోమవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.నిధి మీనాకు సంస్థ అధికారులు అందజేశారు. తాజాగా సమకూర్చిన నిధులతో విద్యుదుత్పత్తి కేంద్రానికి పరిసర ప్రాంతాలైన కొండపల్లి, ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు, గుంటుపల్లి, జూపూడి, తుమ్మలపాలెం, మూలపాడు, కిలేశపురం తదితర గ్రామాల్లో సీఎస్ఆర్ కార్యకలాపాలు చేపట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ను కోరారు.