జీవన్ రెడ్డికి మొగిలిపేట రైతుల వినతి
NEWS Nov 04,2024 02:17 pm
మల్లాపూర్ మండలం మొగిలిపేట కెనరా బ్యాంక్‌లో పంట రుణ మాఫీ మిస్ అయ్యిందని, అర్హులైన రైతులకు వెంటనే రుణ మాఫీ అందించగలరని కోరుతూ.. రైతులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంట రుణ మాఫీకి అర్హత పొందమన్నారు. అయితే, CLW (పంట రుణ మాఫీ) పోర్టల్ లో తమ పేర్లు చూపించడం లేదని, "డేటా లభించలేదు" అని సూచిస్తోంది అని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.