మల్లాపూర్‌లో చేప పిల్లల పంపిణీ
NEWS Nov 04,2024 02:15 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మత్స శాఖ ఆధ్వర్యంలో మత్స కార్మికులకు చేప పిల్లల పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా చెరువులు, కుంటలలో మత్స్య కార్మికులు చేపలను పెంచేందుకుగాను సోమవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు గంగాధర్, గణేష్, రాజేందర్ లు మత్స్య కార్మికులకు 1,21,860 చేప పిల్లలను పంపిణీ చేశారు.