ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Nov 04,2024 02:06 pm
మల్లాపూర్ మండలం ముత్యంపేట సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముత్యంపేట పిఎసిఎస్ చైర్మన్ తక్కల్ల నరేష్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజేందర్, డైరెక్టర్లు ఏలేటి వెంకటేశ్వర రెడ్డి, వాకిటి భూమారెడ్డి, తేలు ముత్యం రెడ్డి, ఉదయగిరి లింబాద్రి, సీఈఓ రమేష్, సిబ్బంది ప్రేమ్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం 17 శాతం వచ్చేటట్టు చూసుకోవాలని అన్నారు. 17% వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.