మైలవరం నియోజకవర్గంలో 80 కిలోమీటర్ల పొడవునా రహదారుల మరమ్మత్తులకు రూ. 1.82 కోట్లు మంజూరైనట్లు మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెం గ్రామంలో గుంతలు లేని రోడ్లు సాధనగా ప్రభుత్వం ముందడుగు కార్యక్రమంలో భాగంగా ఆర్ అండ్ బి రహదారుల మరమ్మత్తు పనులను MLA ప్రారంభించారు.