మాజీ సర్పంచుల అరెస్టులు అప్రజాస్వామికం
NEWS Nov 04,2024 10:35 am
సంగారెడ్డి: సర్పంచుల పెండింగ్ బిల్లు విడుదల చేయాలని ఛలో హైదరాబాద్ పోరు బాట వెళ్తున్న వివిధ గ్రామాల మాజీ సర్పంచులను నిర్భంధిస్తూ, అరెస్టులు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. సీఎంను కలసి వినతి పత్రం ఇవ్వాలని హైదరాబాద్ వెళుతున్న సర్పంచులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.