మొగిపేటలో నూతన మీసేవ ప్రారంభం
NEWS Nov 04,2024 09:05 am
మల్లాపూర్ మండలం మొగిలిపేటలో సోమవారం నూతన మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సౌజన్య చేతుల మీదుగా మీసేవ నిర్వహకుడు సాంబారి ప్రశాంత్ సేవలను ప్రారంభించారు. పౌర సేవలు, రెవిన్యూ సంబంధిత సేవలు, ప్రభుత్వ సేవలకై మీసేవను వినియోగించుకోవాలని, గ్రామ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని తెలిపాడు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వంతడుపుల నాగరాజు, నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.