డిప్యూటీ సీఎంని కలిసిన ఎల్లారెడ్డి MLA
NEWS Nov 04,2024 10:47 am
KMR: డిప్యుటీ సీఎం బట్టి విక్రమార్కని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ సోమవారం కలిశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ బిల్స్‌ను త్వరగా విడుదల చేయాలని ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. మోతేలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేశమని తెలిపారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.