మాజీ సర్పంచులకు మద్దతుగా కోరుట్ల MLA
NEWS Nov 04,2024 07:21 am
పెండింగ్ బిల్లుల విడుదలకై సర్పంచ్ ల ఫోరం ఇచ్చిన పోరుబాట కార్యక్రమనికి వెళ్తున్న మాజీ సర్పంచ్ లను ఎక్కడిక్కడే ముందస్తు అరెస్ట్ లు చెయ్యడాన్ని ఖండిస్తూ, అరెస్ట్ అయిన మాజీ సర్పంచ్‌లకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మద్దతు తెలిపారు. బొల్లారం పోలీస్ స్టేషన్ లో మాజీ సర్పంచ్‌ల మధ్యలోనే కూర్చొని వారితో కలిసి నిరసనలో పాల్గొన్నారు.