చక్రాయపేట: కరువు మండలంగా ప్రకటించాలి
NEWS Nov 04,2024 10:42 am
చక్రాయపేట మండలంను కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం ఉదయం బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చక్రాయపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. అలాగే కాలేటి వాగు ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాలు సమర్పించారు.