కవులకు సాహిత్య పరిషత్ సన్మానం
NEWS Nov 03,2024 06:37 pm
జాతీయ సాహిత్య పరిషత్ మెట్ పల్లి వారు బతుకమ్మ పాటలు, కవితలు, గేయాలు రాసిన కవులకు ఆదివారం సన్మానం చేశారు. మండల విద్యాధికారి మేకల చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కవితలు చదివిన కవులకు జ్ఞాపిక కండువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు నంబి రాజేందర్ శర్మ, మర్రి భాస్కర్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.