ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
NEWS Nov 03,2024 06:37 pm
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వం తక్షణమే పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే. రవిచందర్, వనంపల్లి జైపాల్రెడ్డి అన్నారు. మెట్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన ఏఐటీయూసీ 4వ మహాసభలో వారు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.